Chennai: తాగునీరు అందించి ఆదుకోవాలని కోరిన తమిళనాడు మంత్రులు... వెంటనే ఓకే చెప్పిన సీఎం జగన్

  • తమిళనాడులో తీవ్రస్థాయికి చేరిన నీటి ఎద్దడి
  • చెన్నై లో గుక్కెడు తాగునీరు దొరకని దారుణ స్థితి
  • చెన్నైకి తాగునీరు అందించాలంటూ అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోతున్న తమిళనాడులో తాగునీటి ఎద్దడి తీవ్రస్థాయికి చేరింది. ముఖ్యంగా చెన్నై మహానగరంలో మంచినీటి లభ్యత అత్యంత దారుణ స్థితికి చేరింది. దాంతో, తాగునీరు అందించి ఆదుకోవాలంటూ తమిళనాడు మంత్రుల బృందం ఏపీ సీఎం జగన్ ను కలిసి వినతిపత్రం అందించింది. తమిళనాడు మంత్రుల విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. వెంటనే చెన్నై నగరానికి మంచినీటిని అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరం పాలుపంచుకుందాం అంటూ తమిళ మంత్రులకు జగన్ స్నేహ హస్తం చాచారు. ఈ సందర్భంగా, పొరుగు రాష్ట్రం కష్టాల్లో ఉంటే తాము స్పందించకుండా ఎలా ఉంటామని జగన్ అన్నట్టు తెలిసింది.
Chennai
Tamilnadu
Jagan
Andhra Pradesh

More Telugu News