Jagan: జగన్ పై మరోసారి విమర్శలు గుప్పించిన కన్నా లక్ష్మీనారాయణ

  • అవినీతిపై మాటలే తప్ప చేతలు లేవు
  • టెండర్లను రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదు
  • వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు ఇస్తున్నారు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు గుప్పించారు. దివంగత రాజశేఖరరెడ్డి పేదలకు కూడు పెడితే... జగన్ పొట్ట కొడుతున్నారని దుయ్యబట్టారు. అవినీతి నిర్మూలనపై జగన్ వి మాటలే తప్ప చేతలు లేవని అన్నారు. వరుసగా టెండర్లను రద్దు చేసుకుంటూ పోతే నష్టమే తప్ప లాభం లేదని చెప్పారు. ఇసుక విధానంపై కావాలనే కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలిస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంటుపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ, ఈయన పైవ్యాఖ్యలు చేశారు.
Jagan
Kanna
YSRCP
BJP

More Telugu News