Bharataratna: భారతరత్న అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

  • ఈ ఏడాది ముగ్గురికి భారతరత్న పురస్కారాలు
  • రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రదానోత్సవం
  • అవార్డు అందుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
భారత్ లో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ ఏడాది భారతరత్న అవార్డులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ సంగీత దర్శకుడు భూపేన్ హజారికా, సంఘ సంస్కర్త నానాజీ దేశ్ ముఖ్ లను వరించింది. హజారికా, దేశ్ ముఖ్ లకు మరణానంతరం ఈ అవార్డు ప్రకటించారు. కాగా, ఈ సాయంత్రం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ ప్రథమపౌరుడు రామ్ నాథ్ కోవింద్ భారతరత్న పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఇక, హజారికా తరఫున ఆయన కుమారుడు తేజ్, నానాజీ దేశ్ ముఖ్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు అవార్డు స్వీకరించారు.
Bharataratna
Pranab Mukherjee
President Of India

More Telugu News