Wagh: వాఘా సరిహద్దు వద్ద ‘సంఝౌతా’ను ఆపిన పాక్ రైల్వే సిబ్బంది

షార్ట్స్‌లో చూడండి
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య నడిచే సంఝౌతా ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేస్తున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాహోర్ నుంచి బయలుదేరిన ‘సంఝౌతా’ను వాఘా సరిహద్దు వద్ద ఆ రైలు నడిపే పాక్ సిబ్బంది నిలిపివేశారు. అక్కడ నిలిపి వేసిన ఈ రైలును వచ్చి తీసుకెళ్లాలని భారత రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో, అక్కడికి చేరుకున్న మన రైల్వే సిబ్బంది భారత భూ భాగంలోకి ‘సంఝౌతా’ను తీసుకొచ్చారు. పంజాబ్ లోని అటారీకి చేర్చారు. భద్రతా కారణాల రీత్యా భారత భూభాగంలోకి రాలేకపోతున్నట్టు పాక్ రైల్వే సిబ్బంది చెప్పినట్టు సమాచారం.
ఈ రైల్లో మొత్తం నూట పది మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
Go Back to Shorts
Wagh
Punjab
Pakistan
Samjhawta
Express

More Telugu News