DGP: విజయవాడలో జూడాలపై పోలీసుల దాడి అనుకోకుండా జరిగింది: డీజీపీ సవాంగ్ వివరణ

  • ఎన్ఎంసీ బిల్లును నిరసిస్తూ విజయవాడలో జూడాల ధర్నా
  • జూనియర్ డాక్టర్లపై పోలీసుల బలప్రయోగం
  • వివరణ ఇచ్చిన గౌతమ్ సవాంగ్
ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడం పట్ల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. విజయవాడలో జూనియర్ వైద్యులపై జరిగిన దాడిలో పోలీసుల వైపు నుంచే పొరపాటు జరిగినట్టు అంగీకరించారు. జూడాలపై పోలీసుల దాడి అనుకోకుండా జరిగిన ఘటన అని సవాంగ్ పేర్కొన్నారు. దాడికి సంబంధించిన ఫుటేజ్ చూసిన తర్వాత పోలీసులే తొందరపడినట్టు తెలుస్తోందని అన్నారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
DGP
Gautam Sawang

More Telugu News