Wrestler: వివాహం చేసుకోనున్న రెజ్లర్స్ పునియా, సంగీతా ఫొగట్

  • ప్రపంచ నెంబర్ వన్ రెజ్లర్ పునియా
  • జాతీయ స్థాయి విజేత సంగీతా ఫొగట్
  • 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసిన తర్వాత పెళ్లి
ప్రముఖ రెజ్లర్స్ బజరంగ్ పునియా, సంగీతా ఫొగట్ లు త్వరలో వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలు వెల్లడించారు. ఈ సందర్భంగా నాటి రెజ్లర్, సంగీతా ఫొగట్ తండ్రి మహవీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, పిల్లల అభిప్రాయాలను తాము గౌరవిస్తున్నామని, మూడేళ్లుగా ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారని చెప్పారు. రెండు కుటుంబాల మధ్య వీరి వివాహానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. 2020 టోక్యో ఒలింపిక్స్ ముగిసిన అనంతరం వీరిద్దరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ప్రపంచ నెంబర్ వన్ రెజ్లర్ పునియా. ప్రపంచ స్థాయి రెజ్లింగ్ ర్యాంకింగ్స్ లో 65 కిలోల విభాగంలో పునియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల 59 కిలోల విభాగంలో సంగీతా ఫొగట్ జాతీయ స్థాయి విజేత.
Wrestler
Bhajarang punia
Sangeeta phogat
Marriage

More Telugu News