Krithi garg: ఆసక్తిని రేపుతోన్న 'రాహు' ఫస్టులుక్

  • థ్రిల్లర్ సినిమాగా రూపొందిన 'రాహు'
  • విభిన్నమైన పాత్రలతో సాగే కథాకథనాలు 
  • థ్రిల్ చేయడం ఖాయమంటున్న సుబ్బు
తెలుగులో కొత్త దర్శకుల రాక క్రమక్రమంగా పెరుగుతోంది. కొత్త కాన్సెప్టులతో తమ సత్తాను చాటుకోవడానికి కొత్త దర్శకులు తమవంతు కృషి చేస్తున్నారు. తెలుగు తెరపై అద్భుతమైన ఆవిష్కారాలు చేస్తూ తమ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటున్నారు. అలా 'రాహు' సినిమాతో సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను వదిలారు. టైటిల్ ను డిజైన్ చేయించిన తీరు .. ఫస్టులుక్ పోస్టర్ ఆసక్తిని రేపుతున్నాయి. ఇది ఒక డిఫరెంట్ మూవీ అనే ఆలోచనను కలిగిస్తోంది. కృతి గార్గ్ .. అభిరామ్ వర్మ .. 'కాలకేయ' ప్రభాకర్ .. 'సత్యం' రాజేశ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించనున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేసిన ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయమని దర్శకుడు సుబ్బు చెప్పుకొచ్చాడు. 
Krithi garg
Abhiram varma
kalakeya Prabhakar

More Telugu News