Maharashtra: మహారాష్ట్రలో పడవ బోల్తా.. 14 మంది దుర్మరణం!

  • సంగ్లీ జిల్లాలోని కృష్ణా నదిలో ఘటన
  • వరద ప్రవాహానికి మరో ముగ్గురు గల్లంతు
  • ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం ఫడ్నవీస్
మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కృష్ణా నదిలో వెళుతున్న ఓ పడవ వరద ప్రవాహానికి అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గల్లంతయ్యారు. మిగిలినవారిని స్థానికులు, పడవలు నడిపేవారు సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. భారీ వర్షాలతో మహారాష్ట్రలోని సంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో ప్రజాజీవనం స్తంభించిపోయింది.

వాగులు, వంకలన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు ఈ రెండు జిల్లాల్లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా సంగ్లీలో 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, కొల్హాపూర్ లో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. దాదాపు 1.30 లక్షల మంది ప్రజలను రెండు జిల్లాల యంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించింది.
Maharashtra
floods
14 dead
krishna river
sangli district
fadnavis
Chief Minister
boat capsizes

More Telugu News