Vijaya Devarakonda: విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమంటున్న ప్రియా వారియర్

  • ఓ ఫొటోను పోస్ట్ చేసిన మలయాళ భామ
  • ఆ ఫొటోలో విజయ్ దేవరకొండతో ప్రియా వారియర్ 
  • ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ పోస్ట్
‘ఒరు ఆదార్ లవ్’ చిత్రంలో కన్ను గీటిన నటి ప్రియా ప్రకాశ్ వారియర్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతటి పాప్యులారిటీ సంపాదించుకున్న ప్రియా వారియర్, టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని చెబుతోంది. ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అంటూ విజయ్ దేవరకొండతో కలిసి దిగిన ఓ ఫొటోను ప్రియా వారియర్ పోస్ట్ చేసింది. అయితే, ఈ ఫొటోను ఏ సందర్భంగా వాళ్లిద్దరూ దిగారో ఆమె ప్రస్తావించలేదు. కాగా, బాలీవుడ్ మూవీ ‘శ్రీదేవి బంగ్లా’లో ప్రియా వారియర్ నటించనుంది. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ ఈ మధ్యే విడుదలైంది.
<iframe src="https://www.facebook.com/plugins/post.php?href=https%3A%2F%2Fwww.facebook.com%2Fpriyawarrieractress%2Fposts%2F2253419851634829&width=500" width="500" height="594" style="border:none;overflow:hidden" scrolling="no" frameborder="0" allowTransparency="true" allow="encrypted-media"></iframe>
Vijaya Devarakonda
priya varrier
Sridevi Bungla

More Telugu News