Anasuya: 'కథనం' ఎందుకు చేశానన్నది సినిమా చూస్తే తెలుస్తుంది: అనసూయ

  • అనసూయ ప్రధాన పాత్రధారిగా 'కథనం'
  • రేపు ప్రేక్షకుల ముందుకు 
  • థ్రిల్ చేస్తుందన్న అనసూయ
బుల్లితెరపై అల్లరి చేస్తూ ఆకట్టుకునే అనసూయ, వెండితెరపై మాత్రం ప్రత్యేకమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అలా తాజాగా ఆమె చేసిన 'కథనం' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో అనసూయ బిజీగా వుంది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమా చేయడానికి ముందు నేను 12 కథలు విన్నాను. అవేవీ నాకు కొత్తగా అనిపించలేదు. ఆలస్యమైనా వైవిధ్యభరితమైన కథలనే చేద్దామని వెయిట్ చేస్తుండగా 'కథనం' నా దగ్గరికి వచ్చింది. 'కథనం' నేను ఎందుకు చేశానన్నది సినిమా చూస్తే తెలుస్తుంది. ఇది ఒక డిఫరెంట్ మూవీ. ప్రేక్షకులను పూర్తిస్థాయిలో థ్రిల్ చేస్తుంది. మంచి ఫీడ్ బ్యాక్ వస్తుందనే నమ్మకం వుంది" అంటూ చెప్పుకొచ్చింది. 
Anasuya

More Telugu News