Revanth Reddy: అనుమతి లేకుండా నిర్మించిన విల్లాలను ఎప్పటిలోగా కూల్చేస్తారు?: రేవంత్ రెడ్డి

  • టీఎస్ఐఐసీ కింద ఎమ్మార్ ప్రాపర్టీకి భూములు కేటాయించారు
  • దీనికి బల్దియా అనుమతి లేదు
  • జీహెచ్ఎంసీ సమావేశంలో రేవంత్
ఎమ్మార్ ప్రాపర్టీలోని విల్లాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. టీఎస్ఐఐసీ కింద ఎమ్మార్ ప్రాపర్టీకి భూములను కేటాయించారని... అయితే, వీటికి బల్దియా అనుమతి లేదని చెప్పారు. ఈరోజు జరిగిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. అనుమతి లేకుండా నిర్మించిన విల్లాలను ఎప్పటిలోగా కూల్చేస్తారని ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారులను రేవంత్ ప్రశ్నించారు.
Revanth Reddy
Cogress
GHMC
EMMAR Properties

More Telugu News