Hyderabad: హైదరాబాద్ లో ఫ్యాషన్ షో.. ర్యాంప్ వాక్ చేసి అలరించిన రేణూ దేశాయ్!

షార్ట్స్‌లో చూడండి
చేనేత వస్త్రాలు అనగానే ప్రస్తుతం కొందరికి చిన్నచూపు అయిపోయిందని ప్రముఖ నటి, దర్శకురాలు రేణూదేశాయ్ అన్నారు. చేనేత వస్త్రాలు కొంచెం ఖరీదుగా మారిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ దుస్తుల వాడకాన్ని ప్రోత్సహించేందుకు తాము కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కేవలం మహిళలే కాకుండా అబ్బాయిలకు కూడా చేనేత షర్టులు, టీషర్టులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన చేనేత వస్త్రాల ఫ్యాషన్ షోలో పాల్గొన్న రేణూ దేశాయ్.. ఈ సందర్భంగా ర్యాంప్ వాక్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను అలరించారు.
Go Back to Shorts
Hyderabad
handloom
fashion show
ramp walk
renu desai

More Telugu News