మోదీ ఏం మాట్లాడతారోనని సర్వత్ర ఉత్కంఠ!
- నేడు జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగం
- ఆర్టికల్ 370 రద్దుకు దారితీసిన పరిస్థితులు వివరించే అవకాశం
- పలు కీలక నిర్ణయాలను ప్రకటించే చాన్స్
లోక్ సభలో పూర్తి బలం ఉన్నా, అన్ని బిల్లులనూ రాజ్యసభలో ముందు ప్రవేశపెట్టి, తమ వ్యూహాలతో వాటికి ఆమోదం పొందుతూ, ఆపై లోక్ సభలో ప్రవేశపెడుతున్న బీజేపీ, తదుపరి లక్ష్యాలను, దేశ ఆర్థిక వృద్ధిని పెంచుకునే దిశగా తీసుకోబోయే చర్యల గురించి ఆయన మాట్లాడవచ్చని తెలుస్తోంది. జీఎస్టీని మరింత సరళీకృతం చేయడం, విదేశీ పెట్టుబడులకు మరింత పెద్దపీట, కశ్మీర్ లో కొత్త ఇన్వెస్ట్ మెంట్స్, అక్కడి ప్రజలకు ఉపాధిని పెంచేలా తీసుకోబోయే నిర్ణయాల గురించి కూడా మోదీ ప్రస్తావించవచ్చని సమాచారం.