Sumalatha: ఢిల్లీలో బీజేపీ నేతలతో సుమలత డిన్నర్ మీటింగ్... అవసరమా? అంటూ నెటిజన్ల కామెంట్లు!

  • సుష్మా స్వరాజ్ మరణించిన సమయంలో ఈ ట్వీట్లేంటి?
  • సుమలత ట్వీట్ పై బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం
  • తప్పును సరిదిద్దుకుంటూ సంతాప కామెంట్
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్యా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగి, అనూహ్యంగా విజయం సాధించిన నటి సుమలతా అంబరీష్, తాను పెట్టిన ట్వీట్ తో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే... రెండు రోజుల క్రితం, బీజేపీ సీనియర్ నేత, ఢిల్లీ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ కన్నుమూసిన వేళ, సుమలత ఢిల్లీలోనే ఉన్నారు.

 బీజేపీ శ్రేణులంతా ఆవేదనలో ఉన్న సమయంలో, ఢిల్లీలోని కర్ణాటక భవనంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, కేంద్ర మంత్రులు డీవీ సదానందగౌడ తదితరులతో డిన్నర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఫోటోను అర్ధరాత్రి 12:18 గంటల సమయంలో సుమలత అప్‌ లోడ్‌ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తల్లో ఆగ్రహం పెల్లుబికింది. సుష్మా స్వరాజ్‌ మృతి చెందిన సమయంలో ఆమెను జ్ఞాపకం చేసుకోకుండా ఈ తరహా డిన్నర్ మీటింగ్ ల ట్వీట్లు, ఫోటోలు పెట్టడం అవసరమా? అంటూ తిట్లకు దిగారు. దీంతో తన తప్పును తెలుసుకున్న ఆమె, సుష్మా స్వరాజ్‌ మరణం దేశానికి తీరని లోటని అంటూ మరో ట్వీట్ చేయడంతో పరిస్థితి కొంత సద్దుమణిగింది.
Sumalatha
Twitter
BJP
Yedeyurappa
New Delhi

More Telugu News