Andhra Pradesh: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన

షార్ట్స్‌లో చూడండి
ఏపీ, తెలంగాణలకు హైదరాబాద్ వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద వాయుగుండం తీరం దాటిందని వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి బలహీనపడుతుందని చెప్పింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
Rain

More Telugu News