ఆర్టికల్ 370 రద్దు.. భారత్ అంతర్గత వ్యవహారం: టిబెట్ ప్రవాస అధ్యక్షుడు
- భారత అంతర్గత విషయాల్లో మేం జోక్యం చేసుకోం
- తమ ప్రధాన సమస్యల్లో టిబెట్ ఒకటని చైనా చెబుతోంది
- భారత్ కూడా అచ్చం ఇలాగే చెప్పాలి
తమ ప్రధాన సమస్యలలో టిబెట్ ఒకటి అని చైనా చెబుతోందని, భారత ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని చెప్పాలని లోబ్సంగ్ కోరారు. భౌగోళికంగా, రాజకీయంగా టిబెట్ చాలా ముఖ్యమైనదని ఆయన పేర్కొన్నారు. టిబెట్-భారత్ మధ్య ఉన్న 2500-3000 పొడవైన సరిహద్దు ఇప్పుడు భారతదేశం- చైనా మధ్య సరిహద్దులో ఉందన్నారు. గతంలో కాకుండా భారత ప్రభుత్వం ఇప్పుడు బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోందని, ఈ డబ్బు విద్య కోసం ఖర్చు చేయొచ్చని లోబ్సంగ్ సూచించారు.