Junior Doctors: జూడాలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై హోం మంత్రి, డీజీపీకి ఫిర్యాదు

  • సుచరిత, సవాంగ్ కు కలిసిన ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్
  • జూడాలపై పోలీసుల దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు
  • విచారణ నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటాం: హోం మంత్రి
నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ విజయవాడలో ఆందోళనకు దిగిన జూనియర్ డాక్టర్లపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై జూడాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్ ను ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కలిసింది. ఈ విషయమై వారికి ఫిర్యాదు చేసింది. దీనిపై సుచరిత స్పందిస్తూ, జూడాలపై జరిగిన దాడి ఘటనపై డీజీపీ విచారణ చేస్తున్నారని, నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటామని  ఏపీ ప్రభుత్వ వైద్యుల అసోసియేషన్ కు ఆమె హామీ ఇచ్చారు.
Junior Doctors
Minister
sucharita
DGP
Sawang

More Telugu News