Delhi: ఢిల్లీకి బయలుదేరిన ఏపీ గవర్నర్

  • ఏపీ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఢిల్లీకి
  • మూడ్రోజుల పాటు పర్యటన
  • రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిని కలవనున్న హరిచందన్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొద్ది సేపటి క్రితం ఢిల్లీ బయలు దేరారు. విజయవాడలోని రాజ్ భవన్ నుంచి ఆయన గన్నవరం విమానాశ్రయానికి బయలు దేరి వెళ్లారు. ఢిల్లీలో ఆయన మూడ్రోజుల పాటు వుంటారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిని ఆయన కలవనున్నారు. మూడ్రోజుల పర్యటన అనంతరం తిరిగి శనివారం సాయంకాలం ఆయన విజయవాడ చేరుకుంటారు. కాగా, ఏపీ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన ఢిల్లీ వెళ్తుండటం గమనార్హం.
Delhi
AP
Govenor
BiswaBhushan
Harichandan

More Telugu News