Andhra Pradesh: అలిపిరి వద్ద జూనియర్ డాక్టర్ల ఆందోళన!

  • కొండపైకి వెళ్లే భక్తులను అడ్డుకున్న జూనియర్ డాక్టర్లు 
  • వాగ్వాదానికి దిగిన భక్తులు
  • నేషనల్ మెడికల్ కమిషన్ రద్దు చేయాలని జూడాల డిమాండ్
అఖిల భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో భాగంగా ఏపీలో పలుచోట్ల జూనియర్ డాక్టర్లు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలోని అలిపిరి వద్ద కొండపైకి వెళ్లే భక్తులను జూనియర్ డాక్టర్లు అడ్డుకున్నారు. దీంతో, భక్తులు ఇబ్బందులు పడ్డారు. జూనియర్ డాక్టర్లతో భక్తులు వాగ్వాదానికి దిగారు. వీరి ఆందోళనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కాగా, విజయవాడలో అరెస్టు చేసిన జూనియర్ డాక్టర్లను విడుదల చేయాలని, సమస్యను పరిష్కరించేందుకు తమతో చర్చించాలని తిరుపతి జూడాలు డిమాండ్ చేశారు.
Andhra Pradesh
Tirupathi
Junior Doctors
Alipiri

More Telugu News