Nannapaneni Rajakumari: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన నన్నపనేని రాజకుమారి

  • వైసీపీ అధికారంలోకి రావడంతో రాజీనామా
  • మూడేళ్ల రిపోర్టును గవర్నర్ కు పంపిన నన్నపనేని
  • తన హయాంలో ఎందరో మహిళలకు అండగా నిలిచానంటూ వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ హరిచందన్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన హయాంలో ఎందరో బాధిత మహిళలకు అండగా నిలిచానని చెప్పారు. మూడేళ్ల రిపోర్టును గవర్నర్ కు అందజేశానని తెలిపారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలని... అప్పుడే నేరాలు తగ్గుతాయని చెప్పారు.
Nannapaneni Rajakumari
Telugudesam

More Telugu News