Andhra Pradesh: టీడీపీ నేత యనమలపై మండిపడ్డ విజయసాయిరెడ్డి!
ప్రధాని మోదీకి అందించిన వినతిపత్రాన్ని బయటపెట్టాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కోరడంపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడేవారని ఆయన తెలిపారు.
అయితే యనమల రామకృష్ణుడికి చాలా కాలం తర్వాత ఇప్పుడు మాట్లాడే స్వేచ్ఛ దొరికిందని ఎద్దేవా చేశారు. అప్పట్లో మాట్లాడాలంటే కుటుంబరావు అనుమతి తీసుకోవాల్సి వచ్చేదని తాను విన్నట్లు చెప్పారు. తన వియ్యంకుడు చేపట్టిన కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణ కోరుతూ తొలుత యనమల లేఖ రాయాలనీ, ఆ తర్వాతే విమర్శలు చేయాలని హితవు పలికారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.