మన అదృష్టం బాగుండి చంద్రబాబు అధికారంలో లేకుండా పోయారు.. లేదంటేనా!: విజయసాయిరెడ్డి
- పెట్టుబడిదారులకు అనుసంధానకర్తనని చెప్పుకునేవారు
- ఆయన ఇన్ సైడర్ ట్రేడింగులో తలపండిన వ్యక్తి
- ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉత్పత్తులను వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్రా, ఫ్యూచర్ గ్రుప్ వంటి కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ చేస్తాయని చంద్రబాబు గతంలో చెప్పారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. ఈ మేరకు గతంలో జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అయితే ఈ కంపెనీలు కొనుగోలు చేస్తున్న వస్తువులేమిటో చంద్రబాబు, ఆయన అనుచరులు సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.