Andhra Pradesh: మల్లెల పద్మనాభరావు గారి మరణం కృష్ణా జిల్లాకు తీరని లోటు!: కేశినేని నాని

  • ఇబ్రహీంపట్నం సర్పంచ్ గా పనిచేసిన మల్లెల
  • ఆయన మరణంపై కేశినేని నాని దిగ్భ్రాంతి
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన
జమీందారి కుటుంబంలో పుట్టిన మల్లెల పద్మనాభరావు వందలాది ఎకరాలను సమాజ శ్రేయస్సు కోసం దానం చేశారని టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని తెలిపారు. సామాన్యుడిలా ఆదర్శ జీవితం గడపడమే కాకుండా 45 సంవత్సరాల పాటు ఆయన ఇబ్రహీంపట్నం సర్పంచ్ గా పనిచేశారని చెప్పారు.

దీంతో ఆయన్ను ఏకంగా రాష్ట్రపతి సన్మానించారని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం కృష్ణా జిల్లా ప్రజలకు తీరని లోటని కేశినేని నాని అన్నారు. మల్లెల పద్మనాభరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. పద్మనాభరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
Twitter
Facebook
mallella padmanabharao
Krishna District

More Telugu News