sushma swaraj: 15 రోజుల వ్యవధిలో కన్నుమూసిన ఇద్దరు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులు
- ఢిల్లీకి ఐదో ముఖ్యమంత్రిగా పనిచేసిన సుష్మ
- ఆరో ముఖ్యమంత్రిగా షీలా సేవలు
- సుష్మాను ఓటమి పాలు చేసిన ఉల్లిగడ్డ ధరలు
ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఇద్దరు మహిళలు 15 రోజుల వ్యవధిలో మరణించడాన్ని ఢిల్లీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఢిల్లీకి ఆరో ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత షీలాదీక్షిత్ గత నెల 20న గుండెపోటుతో కన్నుమూయగా, అదే గుండెపోటుతో బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ ఐదో ముఖ్యమంత్రిగా సుష్మ పనిచేశారు.
1999 ఎన్నికలకు 40 రోజుల ముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన సుష్మ ఉల్లిపాయల ధరలు అకస్మాత్తుగా పెరగడంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. అప్పట్లో కిలో ఉల్లిపాయలు రూ.50కు పెరిగి సామాన్యులకు పెను భారంగా మారాయి. దీంతో చవక ధరల దుకాణాల ద్వారా వాటిని అందరికీ అందుబాటులో ఉంచారు. అయినప్పటికీ ఆమె ఓటమిని ఆ ప్రయత్నాలు ఆపలేకపోయాయి.