Nagarjuna: 'మన్మథుడు 2' విడుదలకి రంగం సిద్ధం

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'మన్మథుడు 2'
  • U/A సర్టిఫికెట్ మంజూరు 
  • ఈ నెల 9వ తేదీన విడుదల

నాగార్జున కథానాయకుడిగా .. రకుల్ నాయికగా 'మన్మథుడు 2' రూపొందింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో ఝాన్సీ .. దేవదర్శి .. కనిపించనున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమైన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకాన్ని నాగార్జున వ్యక్తం చేశారు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. 

More Telugu News