Jayam Ravi: కాజల్ మూవీపై రజనీ ఫ్యాన్స్ ఫైర్

  • కాజల్ కథానాయికగా 'కోమాలి'
  • విభిన్నమైన పాత్రలో జయం రవి  
  • ఈ నెల 15వ తేదీన విడుదల     
తమిళంలో కాజల్ - జయం రవి నాయికా నాయకులుగా 'కోమాలి' చిత్రం రూపొందింది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15వ తేదీన విడుదల కానుంది. 16 సంవత్సరాల పాటు కోమాలో వుండి బయటికి వచ్చిన వ్యక్తిగా ఈ సినిమాలో జయం రవి కనిపిస్తాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు.

కోమాలో నుంచి బయటికి వచ్చిన జయం రవి ఎదురుగా వున్న టీవీ చూస్తాడు. 'నేను రాజకీయాల్లోకి వస్తాను' అని రజనీ చెబుతుండటం చూసి, ఇది ఏ సంవత్సరం అని యోగిబాబును అడిగితే 2016 అంటాడు. అబద్ధాలు చెప్పి నన్ను ఫూల్ చేయాలనుకుంటున్నావా .. ఇది 1996 అని జయం రవి అంటాడు. అంటే తను రాజకీయాల్లోకి వస్తానని రజనీ అప్పటి నుంచి చెబుతూనే వున్నాడనే అర్థం వచ్చేలా చూపించారు. దాంతో రజనీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఫైర్ అవుతున్నారు. తమకి ఆ ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చిన దర్శక నిర్మాతలు, రజనీకి సంబంధించిన సీన్ ను కట్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. 
Jayam Ravi
Kajal Agarwal

More Telugu News