Naresh: మళ్లీ జన్మంటూ వుంటే మా అమ్మ కడుపునే పుడతాను: సీనియర్ నరేశ్

  • నాకు నటన నేర్పించింది అమ్మనే
  • 46 చిత్రాలకి ఆమె దర్శకత్వం వహించారు
  • ఎంతోమందికి ఆమె సహాయం చేసిందన్న నరేశ్  
విజయనిర్మల తనయుడైన నరేశ్, ఆమె దర్శకత్వంలోనే అనేక చిత్రాలలో నటించాడు. హాస్యకథానాయకుడిగా మంచిపేరు తెచ్చుకున్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమెను గురించి ఆయన ప్రస్తావించాడు.

"విజయనిర్మల గారు నాకు తల్లి మాత్రమే కాదు .. నటన నేర్పించిన గురువు కూడా. నటుడిగా నా కెరియర్ ను ఆమె తీర్చిదిద్దారు. 46 చిత్రాలకి దర్శకత్వం వహించిన ఘనత ఆమె సొంతం. ఆమె మనసు ఎంతో సున్నితం .. ఎంతోమందికి ఆమె సహాయ సహకారాలను అందించారు. తన ఇంట్లో పనిచేసినవారికి .. కొంతమంది బంధువులకి ఆమె ఇళ్లు కట్టించి ఇచ్చారు. చాలామందికి తన ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించారు. మళ్లీ జన్మంటూ వుంటే ఆమె కడుపునే పుట్టాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు. 
Naresh
Ali

More Telugu News