కశ్మీర్ కోసం ప్రాణమైనా ఇస్తా... పీఓకే కూడా మనదే: లోక్ సభలో అమిత్ షా ఉద్వేగం
- కశ్మీర్ ఉద్రిక్తతలకు కాంగ్రెస్ పార్టీయే కారణం
- బిల్లును ఆమోదించేందుకు సహకరించాలి
- పీఓకే నుంచి పాకిస్థాన్ వైదొలగాలన్న అమిత్ షా
ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సైతం బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని, లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే, ప్రజలు హర్షిస్తారని అన్నారు. ఈ బిల్లు అమలైతే కశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అమిత్ షా గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్ కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న పీఓకే సైతం భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.