Shahid Afridi: భారత వైఖరిపై విషం కక్కిన షాహిద్ అఫ్రిది!

  • ఆర్టికల్ రద్దు నిర్ణయంపై మండిపాటు
  • కశ్మీరీలకు కనీస హక్కులు ఇవ్వడం లేదు
  • ట్విట్టర్ లో మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, భారత ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండించాడు. ఐరాస తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ ప్రజలకు భారత ప్రభుత్వం కనీస హక్కులు ఇవ్వడం లేదని, అసలు ఐరాస ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలియడం లేదని వాపోయాడు.

హక్కుల ఉల్లంఘన ఈ స్థాయిలో ఉన్నా, ఐరాస నిద్రపోతోందని, కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు ఐక్యరాజ్యసమితి స్పందించట్లేదని ప్రశ్నించాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రిది కోరాడు. తాను పెట్టిన ట్వీట్ ను యూఎన్ఓ, డొనాల్డ్ ట్రంప్‌ కు ట్యాగ్ చేశాడు.
Shahid Afridi
India
Pakistan
Article 370
Jammu And Kashmir

More Telugu News