Jammu And Kashmir: జమ్ముకశ్మీర్ ఏదోఒక రోజు మళ్లీ రాష్ట్రం అవుతుంది: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

  • పునర్విభజన బిల్లుతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కశ్మీర్
  • తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్న కేంద్ర హోంమంత్రి
  • పరిస్థితులు మెరుగుపడితే మళ్లీ రాష్ట్ర హోదా వస్తుందన్న అమిత్ షా
ఆర్టికల్ 370, 35A రద్దుతోపాటు జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. తాజా పరిణామాలతో రాష్ట్రం హోదాను కోల్పోయిన జమ్ముకశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయింది. జమ్ముకశ్మీర్ అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడఖ్ చట్టసభలేని కేంద్ర పాలిత ప్రాంతంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, పరిస్థితులు అనుకూలిస్తే జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం హోదాను సంతరించుకుంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘‘జమ్ముకశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలను ఎప్పటికీ కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉంచాలని అనుకోవడం లేదు. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుంది’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.

Jammu And Kashmir
union terrirory
Amit Shah

More Telugu News