Chandrababu: కనీసం మొదటి సంతకంలో కూడా నిజాయతీ లేకపోతే ఎలా?: జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న

షార్ట్స్‌లో చూడండి
ఆశా వర్కర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేస్తున్నారని మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. వారి జీతాలను పెంచుతున్నామని చెప్పి, ఫైల్ పై సంతకం చేసి రెండు నెలలు దాటుతున్నా, ఇంకా కొత్త వేతనాలు అమలులోకి రాలేదని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

 "మోసం చేయాలన్న ఆలోచన లేకపోతే, ముఖ్యమంత్రి సంతకం చేసి రెండు నెలలు కావొస్తున్నా జీఓ జారీ కాకపోవడం ఏంటి? దీనికితోడు ఏళ్ళ తరబడి పనిచేస్తున్న ఆశా వర్కర్లను వెళ్ళిపోమంటూ వేధింపులా? మోసం చేయడానికీ, పీడించడానికీ వాళ్ళు చేసిన పాపం ఏంటి? కనీసం మొదటి సంతకంలో కూడా నిజాయితీ లేకపోతే ఎలా?" అని ప్రశ్నించారు. 
Go Back to Shorts
Chandrababu
Jagan
Twitter

More Telugu News