Jammu And Kashmir: మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా అరెస్టు

  • నిన్న వీరిని గృహ నిర్బంధంలో ఉంచిన ప్రభుత్వం 
  • ఈ రోజు అరెస్టు చేసిన పోలీసులు
  • హరినివాస్ అతిథి గృహానికి ముఫ్తీ తరలింపు
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను నిన్న హౌస్ అరెస్టు చేశారు. తాజాగా, వీరిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ముఫ్తీని హరినివాస్ అతిథి గృహానికి తరలించినట్టు సమాచారం. ఆమెతో పాటు మరికొందరు నేతలనూ అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

కాగా, ముఫ్తీ, ఒమర్ లు హౌస్ అరెస్టు అయ్యాక వేర్వేరు ట్వీట్లు చేశారు. ఏం జరగబోతోందో మనకు తెలియదని, మనకు మంచిది అనుకునేదే అల్లాహ్ చేస్తాడని నమ్ముతానని ఒమర్ ట్వీట్ చేశారు. శాంతి కోసం పోరాడే తమ లాంటి ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్టు చేశారని, కశ్మీర్ ప్రజల గొంతు ఎలా నొక్కుతున్నారో ప్రపంచమంతా చూస్తోందని ముఫ్తీ తన ట్వీట్ లో విమర్శించారు.
Jammu And Kashmir
Mehabuba mufti
Omar abdullah

More Telugu News