Pawan Kalyan: కాపుల రిజర్వేషన్లపై స్పందిస్తూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పవన్ కల్యాణ్

  • జమ్మూకశ్మీర్ తో పోలిస్తే కాపుల రిజర్వేషన్ చాలా సులభం అంటూ వ్యాఖ్యలు
  • ఏపీకి ప్రత్యేక హోదాపైనా పవన్ స్పందన
  • తెలంగాణ ప్రజల్లో ఉన్నంత భావోద్వేగాలు ఏపీ ప్రజల్లో లేవంటూ విమర్శ
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాపుల రిజర్వేషన్ అంశాన్ని సీఎం జగన్ రాజకీయ కోణంలో చూడడం సరికాదని అన్నారు. జమ్మూకశ్మీర్ వంటి క్లిష్టమైన సమస్యలకే పరిష్కారాలు కనుగొంటున్నప్పుడు, కాపుల రిజర్వేషన్ ఏమంత కష్టం కాదని అభిప్రాయపడ్డారు.

జమ్మూకశ్మీర్ తో పోలిస్తే కాపుల రిజర్వేషన్ చాలా సులభం అని పేర్కొన్నారు. ఇక, ప్రత్యేక హోదా గురించి స్పందిస్తూ, తెలంగాణ ప్రజల్లో ఉన్నంత భావోద్వేగాలు ఏపీ ప్రజల్లో లేవని అన్నారు. నేతలు, ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాకారమవుతుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయినా, ఏపీకి ప్రత్యేక హోదా అడిగిన వారే ఇప్పుడు వ్యతిరేక పంథా అవలంబిస్తున్నారని ఆరోపించారు.
Pawan Kalyan
Jammu And Kashmir
Jana Sena

More Telugu News