Trivikram: త్రివిక్రమ్ మూవీలో సునీల్ లేనట్టే

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • రావు రమేశ్ ప్లేస్ లో హర్షవర్ధన్
  •  కథలో మార్పుల కారణంగా లేని సునీల్ పాత్ర 
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ మూవీ రూపొందుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను సునీల్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'అరవింద సమేత' సినిమాలో సునీల్ పాత్రకి సంబంధించిన పాత్ర కోత కారణంగా రీ ఎంట్రీలో ఆయనకి రావలసిన గుర్తింపు రాలేదు. అందువలన బన్నీ సినిమాలో సునీల్ కోసం ఒక మంచి పాత్రను త్రివిక్రమ్ క్రియేట్ చేశాడనే ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ పాత్ర లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో రావు రమేశ్ .. సునీల్ కాంబినేషన్లో కొన్ని సీన్స్ అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి రావు రమేశ్ తప్పుకోవడంతో, ఆ ప్లేస్ లోకి హర్షవర్ధన్ ను తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ చాప్టర్ కి సంబంధించి, కథలో కొత్తగా కొన్ని మార్పులు చేసుకున్నారట. ఈ క్రమంలోనే సునీల్ పాత్రను లేపేశారని సమాచారం. సునీల్ కి .. ఆయన అభిమానులకి ఇది నిరాశను కలిగించే విషయమే. 
Trivikram
Allu arjun
Sunil

More Telugu News