Andhra Pradesh: గ్రామ వాలంటీర్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే రోజా!

  • చిత్తూరు జిల్లాలోని వడమాలపేటలో కార్యక్రమం
  • హాజరైన ఏపీఐఐసీ చైర్మన్
  • ఫేస్ బుక్ లో విషయాన్ని పోస్ట్ చేసిన నగరి ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్మన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని వడమాలపేట మండలంలో ఇటీవల గ్రామ వాలంటీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల శిక్షణా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ విషయాన్ని రోజా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. తొలుత సీఎం జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని భావించినప్పటికీ రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు.
Andhra Pradesh
Chittoor District
roja
Apiic chairman
Nagari MLA
Grama volunteer
Appointment letter

More Telugu News