Renu Desai: జనవరి నుంచి నా సినిమా మొదలవుతుంది: రేణు దేశాయ్

  • రైతుల సమస్యల చుట్టూ తిరిగే కథ
  • మొదలైన ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • జనవరి నుంచి షూటింగు మొదలు     

తెలుగు తెరకి కథానాయికగా పరిచయమైన రేణు దేశాయ్, ప్రస్తుతం మరాఠీ సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా వున్నారు. త్వరలో తెలుగులోను ఆమె ఒక సినిమాను రూపొందించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై ఆమె స్పందించారు.

"తెలుగులో నేను ఒక సినిమాను రూపొందిస్తున్న మాట నిజమే. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయి. తెలంగాణ నేపథ్యంలో రైతుల సమస్యలకి సంబంధించినదిగా సాగే కథ ఇది. ఆ యాసలో స్క్రిప్ట్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఇది ఒక ఆర్టు సినిమాలా అనిపించకూడదు .. అలాగని చెప్పేసి పూర్తి కమర్షిల్ మూవీగా కనిపించకూడదు. ఈ రెండింటి మధ్య కథ ఆత్మ దెబ్బ తినకుండా తెరకెక్కించవలసి ఉంటుంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News