Rajya Sabha: రాజ్యాంగాన్ని చింపివేసేందుకు పీడీపీ ఎంపీల యత్నం... బలవంతంగా బయటకు పంపివేత!

  • రాజ్యసభలో తీవ్ర గందరగోళం
  • మీర్ ఫయాజ్, నాజిర్ అహ్మద్ లపై వెంకయ్య ఆగ్రహం
  • చొక్కాలు చించుకుని నిరసన తెలిపిన ఇద్దరు ఎంపీలు
రాజ్యసభలో ఆర్టికల్ 370పై నిరసనల హోరు మధ్య చర్చ జరుగుతున్న వేళ, పీడీపీ సభ్యులు ఇద్దరు రాజ్యాంగాన్ని చింపి వేయడానికి ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎంపీలు మీర్ ఫయాజ్, నాజిర్ అహ్మద్ లు రాజ్యాంగ ప్రతులను నాశనం చేసేందుకు యత్నించారు. దీన్ని గమనించిన చైర్మన్ వెంకయ్యనాయుడు, వారిని మర్యాదగా బయటకు వెళ్లాలని తొలుత ఆదేశించారు. ఆపై వారు తమ చొక్కాలను చించుకుని నిరసన తెలపడంతో, వారిని బలవంతంగా బయటకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
Rajya Sabha
Venkaiah Naidu
Article 370
PDP

More Telugu News