Jammu And Kashmir: పార్లమెంటులో జీరో అవర్, వాయిదా తీర్మానాలపై చర్చ రద్దు.. రాజ్యసభలో జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన అమిత్ షా

  • విసక్ష సభ్యుల వాయిదా తీర్మానాలపై చర్చ రద్దు
  • కశ్మీర్ అంశంపైనే చర్చ జరుగుతుందన్న వెంకయ్యనాయుడు
  • అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకుంటున్న విపక్ష సభ్యులు
పార్లమెంటులో జమ్ముకశ్మీర్ అంశం చర్చకు వచ్చింది. ఉభయసభల్లో జీరో అవర్ ను రద్దు చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై కూడా చర్చ జరగబోదని స్పష్టం చేశారు. కేవలం జమ్ముకశ్మీర్ పై చర్చ మాత్రమే జరుగుతుందని తెలిపారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ పై చర్చను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, విపక్ష సభ్యులపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్యే అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.
Jammu And Kashmir
Bill
Amit Shah
Venkaiah Naidu
Rajya Sabha

More Telugu News