Rohit Sharma: క్రిస్ గేల్ ని వెనక్కి నెట్టి ప్రపంచ రికార్డు సాధించిన రోహిత్ శర్మ

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా విధ్వంసకర ఓపెనర్ రోహిత్ శర్మ మరో ఘనతను సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మెన్ గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ను వెనక్కి నెట్టేశాడు. నిన్న వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20లో రోహిత్ శర్మ రెండు సిక్సర్లను బాదాడు. తద్వారా 106 సిక్సర్లతో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ మెన్ గా అవతరించాడు. 105 సిక్సర్లతో క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. 103 సిక్సర్లతో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ మూడో స్థానంలో నిలిచాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ పరుగులు చేసిన రికార్డు కూడా రోహిత్ పైనే ఉంది. అంతేకాదు, ఎక్కువ సెంచరీలు సాధించిన ఘనత కూడా రోహిత్ పేరిటే ఉంది.
Go Back to Shorts
Rohit Sharma
T20
Sixers
Record
Chris Gayle

More Telugu News