Andhra Pradesh: సుజనా చౌదరి బీజేపీలో చేరినా లోపల పచ్చచొక్కా ఇంకా అలాగే ఉంది!: విజయసాయిరెడ్డి సెటైర్లు

  • ఆయన టీడీపీ ప్రతినిధిగానే వ్యవహరిస్తున్నారు
  • ప్రజాధనం లూటీని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు
  • ట్విట్టర్ లో నిప్పులు చెరిగిన వైసీపీ నేత
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సుజానా చౌదరి బీజేపీలో చేరినా ఇంకా టీడీపీ అధికార ప్రతినిధిలాగే వ్యహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరం కాంట్రాక్టుల రద్దు, విద్యుత్ పీపీఏ ఒప్పందాల్లో అవినీతిపై సమీక్ష.. ఇలా జగన్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటున్నట్లు సుజనా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం లూటీని సుజనా సమర్థించడం చూస్తుంటే లోపల వేసుకున్న పక్క చొక్కా అలాగే ఉందనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Telugudesam
BJP
Sujana Chowdary

More Telugu News