Mahbubnagar District: మహబూబ్ నగర్ జిల్లాలో నెత్తురోడిన రహదారి... 14 మంది దుర్మరణం

  • ఆటోను బలంగా ఢీకొన్న లారీ
  • నుజ్జునుజ్జయిన ఆటో
  • కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఆటోను లారీ ఢీకొన్న దుర్ఘటనలో 14 మంది మరణించారు. మిడ్జిల్ మండలం కొత్తపల్లి వద్ద కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది కూలీలు ఉన్నారు. కూలీలంతా కొత్తపల్లి, భోగ్యా తండాలకు చెందినవారు. పని ముగిసిన తర్వాత మరికాసేపట్లో ఇల్లు చేరుకుంటారన్న నేపథ్యంలో ఈ ఘోరం జరిగింది. ఈ దుర్ఘటనలో 12 మంది అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆటో తునాతునకలైంది. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రహదారిలో మూల మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ రోడ్డు సరిగా లేని కారణంగా తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు.
Mahbubnagar District
Road Accident
Auto
Lorry

More Telugu News