Pawan Kalyan: పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి... టీఆర్ఎస్ కార్యకర్తల డిమాండ్

  • పవన్ నివాసం ముందు టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా
  • రాజమండ్రిలో పవన్ వ్యాఖ్యలు
  • తెలంగాణ అమరవీరులను కించపరిచారంటూ టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహం
ఏపీలో మద్య నిషేధంపై వ్యాఖ్యానిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్య నిషేధం ఎంత కష్టమో వివరించే క్రమంలో పవన్ తెలంగాణ ఉద్యమం నాటి కొన్ని అంశాలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. దీనిపై టీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలు ఉద్యమ అమరవీరులను కించపరిచేవిగా ఉన్నాయని మండిపడ్డారు.

హైదరాబాద్ లోని పవన్ కల్యాణ్ నివాసం ఎదుట ధర్నాకు దిగిన గులాబీ దండు కార్యకర్తలు పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. పవన్ వ్యాఖ్యలు చేయడం పట్ల చర్యలు తీసుకోవాలంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ మద్యనిషేధం ఎంత కష్టమో చెప్పేందుకని సాయుధ పోరాటం నాటి కొన్ని విషయాలను ఉటంకించానని, పోరాటాన్ని అణచివేసేందుకు మద్య నిషేధాన్ని వాడుకున్నా సాధ్యంకాని విషయం గురించి కొన్ని రచనల్లో ఉందని ట్వీట్ చేశారు.
Pawan Kalyan
TRS
Telangana
Hyderabad

More Telugu News