Posani Krishna Murali: పోసాని గారిని మంత్రిని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు: పృథ్వీరాజ్

  • మనం తప్పు చేస్తే తలదించుకుందాం
  • మనలో తప్పు లేకపోతే తల పగలకొట్టు అన్నంత నిజాయతీ పోసానిది
  • అమరావతి కోటపై వైసీపీ జెండా ఎగురుతూనే ఉంటుంది
ప్రముఖ నటుడు, రచయిత, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళిపై ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘మనం తప్పు చేస్తే తలదించుకుందాం. మనలో తప్పు లేకపోతే కొబ్బరికాయ పగలకొట్టినట్టు తల పగలకొట్టు’ అన్నంత నిజాయతీ పోసానిది అని కొనియాడారు. పని చేశామని పదవి ఇవ్వడం కాదని, ‘పోసాని గారిని మంత్రిని చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలన గురించి ప్రస్తావిస్తూ, అమరావతి కోటపై ఎన్ని సంవత్సరాలైన వైసీపీ జెండా ఎగురుతూనే ఉంటుందని, దాన్ని ఎవరూ మార్చలేరని అన్నారు.
Posani Krishna Murali
Prudhvi Raj
YSRCP
amaravathi

More Telugu News