Home Minister: త్వరలోనే గ్రామ స్వరాజ్య పాలన రాబోతోంది: హోం మంత్రి సుచరిత

  • గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాల అందజేత
  • ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా పని చేయాలి
  • కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు
గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలను ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుల, మత, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా వాలంటీర్లు పని చేయాలని సూచించారు. త్వరలోనే గ్రామ స్వరాజ్య పాలన రాబోతోందని అన్నారు. కొత్త ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇస్తామన్న చంద్రబాబు, రెండు నెలలకే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. దివంగత వైసీపీ నేత వైఎస్ వివేకా హత్య కేసును త్వరలోనే ఛేదిస్తామని అన్నారు.
Home Minister
Sucharitha
prathipadu
Volunteer

More Telugu News