Kishan Reddy: ఐబీ హెచ్చరికల కారణంగానే కశ్మీర్ లో అప్రమత్తత: కిషన్ రెడ్డి

  • కశ్మీర్ ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర సహాయమంత్రి వివరణ
  • అమర్ నాథ్ యాత్రికులకు ముప్పుందని ఐబీ హెచ్చరికలు చేసిందన్న కిషన్ రెడ్డి
  • ఎవరి భద్రతకూ ఢోకా లేదంటూ హామీ
కశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. నిఘా సంస్థల హెచ్చరికల కారణంగానే కశ్మీర్లో అప్రమత్తత పాటించాల్సి వస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తులపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించిందని అందువల్లనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జమ్మూకశ్మీర్ లో ప్రతి ఒక్కరి భద్రతకు కట్టుబడి ఉన్నామని, తెలుగు విద్యార్థులు స్వస్థలాలు చేరేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు.
Kishan Reddy
IB
Jammu And Kashmir

More Telugu News