Narendra Modi: నెతన్యాహు ఫ్రెండ్షిప్ డే విషెస్ కు ఇజ్రాయెలీ భాషలో బదులిచ్చిన ప్రధాని మోదీ

  • షోలే పాటతో మోదీకి విషెస్ చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని
  • ఇజ్రాయెలీ భాషలో ట్వీట్ చేసి కృతజ్ఞతలు చెప్పిన మోదీ
  • ఇరుదేశాల స్నేహ బంధం మరింత వికసించాలంటూ ఆకాంక్ష
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి బాలీవుడ్ పాటతో విషెస్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై మోదీ కూడా స్పందించారు. నెతన్యాహు షోలే సినిమా హిట్ సాంగ్ తో ఆశ్చర్యానికి గురిచేయగా, మోదీ ఇజ్రాయెలీ భాషలో బదులిచ్చి అంతే ఆశ్చర్యానికి గురిచేశారు.

"ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు, ఇజ్రాయెల్ ప్రజలకు ధన్యవాదాలు. సుదీర్ఘకాలంగా భారత్, ఇజ్రాయెల్ తమ మైత్రిని చాటుకుంటున్నాయి. మన బంధం విడదీయరానిది, సుదృఢమైనది. భవిష్యత్తులోనే ఇరుదేశాల మధ్య చెలిమి మరింతగా ఎదగాలని, వికసించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ మోదీ ఇజ్రాయెలీ భాషలో ట్వీట్ చేశారు.
Narendra Modi
Benjamin Netanyahu
Friendship Day

More Telugu News