Narendra Modi: బాలీవుడ్ పాటతో మోదీని సర్ ప్రైజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని

  • భారత్ కు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్
  • స్నేహం మరింత వర్ధిల్లాలంటూ ఆకాంక్ష
  • షోలే పాట ఆడియో క్లిప్పింగ్ ను జతచేసిన వైనం
వరల్డ్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బాలీవుడ్ పాటతో భారత ప్రధాని నరేంద్ర మోదీని సర్ ప్రైజ్ చేశారు. ఎవర్ గ్రీన్ హిట్ చిత్రం షోలేలోని 'యే దోస్తీ హమ్ నహీ చోడేంగే' అనే పాట క్లిప్లింగ్ ను జతచేసి ట్వీట్ చేశారు. నిత్యం అభివృద్ధి చెందుతున్న మన చెలిమి, భాగస్వామ్యం నూతన శిఖరాలను తాకాలని కోరుకుంటున్నాం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇండియా అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, తాను, నరేంద్ర మోదీ కలిసున్న ఓ ఫొటోను పోస్టు చేశారు. ఇటీవలే ఇజ్రాయెల్ ఎన్నికల ప్రచారంలో మోదీ ఫొటోలను కూడా బ్యానర్లకు ఎక్కించిన సంగతి తెలిసిందే.
Narendra Modi
Benjamin Netanyahu
Israel
Friendship Day

More Telugu News