Pakistan: కశ్మీర్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న పాకిస్థాన్

  • కశ్మీర్ పరిణామాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ స్పందన
  • జాతీయ భద్రతా కమిటీతో భేటీ కానున్న ఇమ్రాన్
  • సమావేశానికి సైనిక ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ పెద్దలు
కశ్మీర్ లో గత కొన్నిరోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై పాకిస్థాన్ ఓ కన్నేసి ఉంచింది. అమర్ నాథ్ యాత్ర నిలిపివేత, హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను తరలించడం వంటి చర్యలతో కశ్మీర్ లో ఉద్రిక్తభరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఆ ప్రభావం పొరుగున ఉన్న పాకిస్థాన్ లోనూ కనిపిస్తోంది. కశ్మీర్ లోయకు భారత్ భారీగా బలగాలను తరలిస్తుండడంపై పాక్ లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. తాజా పరిణామాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హుటాహుటీన దేశ భద్రతా కమిటీ సమావేశం నిర్వహణకు ఆదేశాలు జారీచేశారు. ఈ భేటీకి సైనిక ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ పెద్దలు, ఇతర అధికారులు హాజరవుతారని తెలుస్తోంది.
Pakistan
India
Jammu And Kashmir

More Telugu News