Warangal Rural District: పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు, కుంటలు

  • ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న ఆకేరు వాగు
  • ఆదిలాబాద్ లో షేక్ గూడ వాగు ఉద్ధృతం  
  • వరదలో చిక్కుకున్న జీపు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలంగాణలోని పలు జిల్లాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఘన్ పూర్, జనగామ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. దీంతో చెరువులు, కుంటల్లోకి నీటిని మళ్లిస్తున్నారు. ఆదిలాబాద్ విషయానికొస్తే, షేక్ గూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ధాటికి ఓ ప్రైవేటు జీపు వరదల్లో చిక్కుకుపోయింది. వరదలో చిక్కుకున్న జీపును జేసీబీ సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఇందుకు స్థానికులు సహకరించారు.
Warangal Rural District
Adilabad District
Rains

More Telugu News