పాక్ కమాండో ఆపరేషన్ను భగ్నం చేసిన భారత్.. ఏడుగురిని హతమార్చిన సైన్యం
- కాల్పుల మాటున ఉగ్రవాదులను భారత్లోకి పంపే యత్నం
- తిప్పి కొట్టిన భారత్
- కొనసాగుతున్న కాల్పులు
వీరంతా జైషే ఉగ్రవాదులు కానీ, పాక్ ఆర్మీకి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ సభ్యులు కానీ అయి ఉంటారని అధికారులు తెలిపారు. కాల్పులు అనంతరం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో నాలుగు మృతదేహాలను గుర్తించినట్టు పేర్కొన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతుండడంతో మృతదేహాలు అక్కడే అలాగే పడి ఉన్నాయని తెలిపారు.